ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారం చూసుకోవాలన్నారు.
పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా వార్తలు
ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్
పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు, విభేదాలు సహజమన్న ఆయన... పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కాసేపట్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్'పై స్పష్టత!