సమాజంలోని పేదలు, అవసరం ఉన్న వారికి చేతన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం రోటరీ లింబ్ సెంటర్లో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు, పలువురు పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.
25 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు, 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు, నలుగురు వికలాంగులకు వీల్ ఛైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేనిగళ్ల అనిల్, రంగారావులను ఎమ్మెల్యే అభినందించారు.