తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులిస్తాం.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్ - వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు... నోరు జారుతున్నారు. గుట్టుగా చేసే పనులను బహిరంగంగా ప్రస్తావిస్తూ టాక్​ ఆఫ్​ ది టౌన్​గా నిలుస్తున్నారు. తాజాగా... "ఓటేస్తే ఖర్చులకు పైసలిస్తాం" అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

mla ramulu nayak comments about money for votes
mla ramulu nayak comments about money for votes

By

Published : Mar 13, 2021, 1:17 PM IST

Updated : Mar 13, 2021, 2:22 PM IST

ఓట్లకు డబ్బులిస్తామన్న ఎమ్మెల్యే... వైరలవుతున్న వ్యాఖ్యలు​...

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. ఎన్నికల్లో ప్రతి ఓటర్​ను ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు గతంలో ఏర్పాటు చేసిన సభలో రాములు నాయక్​ పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడే క్రమంలో... ఓటర్ల లిస్టును మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

ఇప్పటి వరకు బాగానే ఉన్నా... ఓటర్లను ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించుకోవాలనటం నుంచి అసలు కథ మొదలుపెట్టారు. అందులో తమ వర్గం ఉంటారని... వాళ్లు కాకుండా ఇతరులను సైతం తమకే ఓటు వేసేలా చేయాలన్నారు. అందుకోసం... ఖర్చులకు డబ్బులు సైతం ఇస్తామని ఇంటి గుట్టు బయటపెట్టేశారు. ఇది ఆఫ్​ ద రికార్డంటూనే... బహిరంగంగా విషయం వెల్లడించేశారు. ఆ తర్వాత తడుముకుని... విన్న భయమేమీ లేదని, నవ్వుకుంటూనే... అసలు విషయాన్ని అంగట్లో పెట్టేశారు. ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరలయ్యారు.

జిల్లా ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు... తాము ఇస్తానన్న డబ్బులు ఓటర్లకు కాదని... పట్టభద్రుల వివరాలు సేకరించే యువకులకు పారితోషికంగా ఇస్తామన్నామని తెరాస ఓ ప్రకటన విడుదల చేసింది. తమపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఇదీ చూడండి: హ్యాపీ బర్త్​డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ

Last Updated : Mar 13, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details