తెలంగాణ

telangana

ETV Bharat / state

' పార్టీలో క్రమశిక్షణతో పని చేసేవారికి సముచిత స్థానం' - రైతు బంధు సమితి

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్.. ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో పర్యటించారు. రైతు బంధు సమితి సభ్యులు ఎల్లప్పుడు అన్నదాతలకు అండగా ఉండాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని వివరించారు.

mla ramulu naik
mla ramulu naik

By

Published : May 6, 2021, 2:37 PM IST

తెరాసలో పని చేసేవారికి సముచిత స్థానం ఉంటుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో.. రైతు బంధు సమితి మండల కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మేడ ధర్మారావును సత్కరించి.. నియామక పత్రాన్ని అందించారు.

పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే వారికి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు సమితి సభ్యులు.. ఎల్లప్పుడు అన్నదాతలకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు సురేశ్​ నాయక్, వ్యవసాయ అధికారి నరసింహారావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్‌ టీకా స్లాట్‌ బుకింగ్‌లో ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details