వైరా పురపాలక కమిషనర్ విజయానంద్‌కు సన్మానం - వైరా పురపాలక కమిషనర్
వైరా పురపాలక కమిషనర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన విజయానంద్‌ను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, తదితరులు సన్మానించారు. పట్టణంలోని సమస్యల పరిష్కారంలో విజయానంద్ చేసిన కృషిని అభినందించారు.
ఖమ్మం జిల్లా వైరా పురపాలక కమిషనర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన విజయానంద్‌ను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక ఛైర్మన్ సూతకాని జైపాల్, తదితరులు ఘనంగా సన్మానించారు. పురపాలక ఎన్నికలతో పాటు పట్ఠణంలోని సమస్యల పరిష్కారంలో కమిషనర్ విజయానంద్ చేసిన కృషిని అభినందించారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని, సమస్యలు పరిష్కరించి ప్రజల్లో గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఏడు జిల్లాల్లో 'కమలం'కు కొత్త సారథులు