తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతిలో ఖమ్మంను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం' - updated news on minister puvvada

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మంలోని లకారం మినీ ట్యాంక్​బండ్​పై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.

minister-puvvada-ajay-kumar-visited-lakaram-mini-tankbund-in-khammam
పట్టణ ప్రగతిలో ఖమ్మంను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం

By

Published : Feb 24, 2020, 10:13 AM IST

Updated : Feb 24, 2020, 11:02 AM IST

పట్టణ ప్రగతిలో పక్కా ప్రణాళికతో ముందుకు పోతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఖమ్మంలోని లకారం మినీ ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం మంత్రి పరిశీలించారు.

జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్‌లతో కలిసి పట్టణంలోని సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామన్నారు. తాము ముందు నుంచే నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రూ.1.5 కోట్లతో అభివృద్ది చేస్తున్న లకారం ట్యాంక్​బండ్‌నూ మార్చి 1న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో ఖమ్మంను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం

ఇవీ చూడండి:రైతు భరోసా కోసం "అగ్రిటెక్ సౌత్ - 2020"

Last Updated : Feb 24, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details