తెలంగాణ

telangana

ETV Bharat / state

'కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గం' - ఖమ్మం తాజా వార్తలు

ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బయర్​ కంపెనీకి చెందిన మందులు పిచికారి ట్రాక్టర్లను మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు.

'కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గం'
'కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గం'

By

Published : Nov 7, 2020, 12:35 PM IST

వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంతో అవసరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బయర్​ కంపెనీకి చెందిన మందులు పిచికారి ట్రాక్టర్లను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ సారు తీసుకువచ్చిన సమగ్ర సాగు విధానం తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.. ఈ స్ప్రే ట్రాక్టర్​ల వల్ల ఎకరం పంటకు పదిహేను నిమిషాల్లోనే మందు పిచికారి చేయవచ్చన్నారు. ఖర్చు కూడా చాలా తక్కువ అని వివరించారు.

ఇదీ చూడండి:'సార్‌.. నా సమస్యను పరిష్కరించండి.. అదనపు కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు

ABOUT THE AUTHOR

...view details