ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా మందరిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతిలు పాల్గొన్నారు. ఇంజినీరింగ్, రెవిన్యూ, ఇతర విభాగాల అధికారులను అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల పురోగతిపై.. మంత్రి సమీక్ష! - అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆరా
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని.. నిర్ణీత గడువులో పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల పురోగతిపై.. మంత్రి సమీక్ష!