తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

గూడులేని ప్రతి పేదవాడు పక్కా గృహంలో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు పడక గదుల ఇవ్వను అందిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పేర్కొన్నారు.

Minister Puvvada ajay kumar opened two-bedroom houses
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

By

Published : Dec 22, 2019, 5:43 PM IST

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో వసతులు గురించి తెలుసుకున్నారు. అందరూ కొత్త గృహాల్లోనే నివాసం ఉండాలని సూచించారు.

రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
జిల్లాలో 9వేల ఇళ్లు నిర్మాణాలు ప్రారంభించగా... 7వేల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 2 వేల 600 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details