ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో తెరాస నాయకులు ప్రజలను ఆదుకుంటున్నారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 37వ డివిజన్ పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ - తెలంగాణలో లాక్‌డౌన్ వార్తలు
ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో పేదలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిత్యవసర సరుకులు అందజేశారు. కేసీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో తెరాస నాయకులు ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
డివిజన్ తెరాస నాయకుడు పసుమర్తి రాంమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో తెరాస కార్పోరేటర్లు, నాయకులు ప్రజలకు సాయం చేశారన్నారు. వారందరికి అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!