ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తున్నారు. కరోనా సోకకుండా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఖమ్మం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుస్తకాలు అందజేశారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించారు.
ఖమ్మం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
పట్టణంలోని ఇందిరా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. జిల్లాలోని మొత్తం 1329 పాఠశాలల్లోని లక్షా 7 వేల 226 మంది విద్యార్థులకు 5 లక్షల 65 వేల 600 పుస్తకాలను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, డీఈఓ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి
TAGGED:
minister puvvada ajay kumar