ఉద్యోగాల కల్పనపై ప్రజలు, నిరుద్యోగుల్లో ప్రతిపక్షాల అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లెక్కలతో సహా బహిరంగ లేఖ విడుదల చేసినా.. బాధ్యతలేని పార్టీలన్నీ పసలేని వాదన చేస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లక్షా 31వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేటీఆర్ వెల్లడించడంతో ప్రతిపక్షాల ఆరోపణలు బుట్టదాఖలు అయ్యాయని స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రం కల్పించలేదన్నారు. ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.
'ఉద్యోగ భర్తీపై బాధ్యత లేని పార్టీలు పసలేని వాదన చేస్తున్నాయి' - telangana varthalu
ఉద్యోగ భర్తీపై బాధ్యత లేని పార్టీలన్నీ పసలేని వాదన చేస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం కల్పించిన ఉద్యోగాలు ఏ రాష్ట్రం కల్పించలేదని ఆరోపించారు. దేశంలోని భాజపా పాలిత రాష్ట్రాల్లో కల్పించిన ఉద్యోగాల లెక్కలు బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు.
దేశంలోని భాజపా పాలిత రాష్ట్రాల్లో కల్పించిన ఉద్యోగాల లెక్కలు బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఉద్యోగులు, పట్టభద్రులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని.. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు ఓటు వేసి నిబద్దత చూపెడతారని వ్యాఖ్యానించారు. ఓట్లు అడిగేందుకు వస్తున్న డొల్ల పార్టీలకు బుద్ధి చెప్పాలని పట్టభద్రులను మంత్రి పువ్వాడ కోరారు.
ఇదీ చదవండి: మంత్రుల సవాల్: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం