తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు - మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.

ktr birth day celebration in khammam
ఖమ్మంలో ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Jul 24, 2020, 10:34 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో కేటీఆర్ అక్షరాలతో కూడిన కార్డులు పట్టుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడకు వచ్చిన వారంతా మాస్కులు ధరించి సంబురాల్లో పాల్గొన్నారు.

అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తామే చేపడాతమని తెలిపారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details