Minister Harish Rao Meets Thummala : ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో కీలక పరిణాణం చోటుచేసుకుంది. బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీమంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి కలవడం.. రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి అజయ్, ఎంపీలు నామ, రవిచంద్రతో కలిసి తుమ్మల ఇంటికి వెళ్లిన హరీశ్‌రావు అక్కడే భోజనం చేశారు.
అనంతరం తుమ్మలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య పలు కీలక రాజకీయ అంశాలపైచర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చినట్లు తుమ్మలకు హరీశ్ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలో సీఎం కేసీఆర్ రెండు పర్యటనలు, ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని, తుమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది.