తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు మంచి కోసమే నియంత్రిత వ్యవసాయ విధానం'

సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పంటలు సాగైతే.. రాష్ట్ర వ్యవసాయరంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో నియంత్రిత వ్యవసాయంపై ఆయన మొదటి అవగాహన సదస్సు నిర్వహించారు.

minister ajay kumar said Controlled Agricultural Policy in khammam
'రైతు మంచి కోసమే నియంత్రిత వ్యవసాయ విధానం'

By

Published : May 23, 2020, 8:02 PM IST

ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో నియంత్రిత వ్యవసాయంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ ఆర్​.వి.కర్ణన్, రైతు బంధు సమితి నేతలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

"తెలంగాణలో రైతే రాజు నినాదంతోనే రైతు చుట్టూ పరిపాలన నడుస్తోంది. ఏది పడితే ఆ పంటలు పండిస్తే రైతులకు లాభం ఉండదు. ప్రతి క్లస్టర్​లో ఏఈఓ ద్వారా 5 వేల ఏకరాల్లో ఏ పంట వేస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏ జిల్లాల్లో ఏ పంట సాగు చేస్తున్నారనేది తెలుస్తుంది. ఏ ప్రాంతంలో నీటి వసతులు ఉన్నాయి. పలు అంశాల దృష్ట్యా సమగ్ర వ్యవసాయ విధానాన్ని రైతులకు చెబుతారన్నారు. చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు వస్తుందని, రైతు మంచి గురించి మాత్రమే, కానీ చెడును ఉద్దేశించి కాదని అన్నారు."

- రవాణాశాఖ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్

'రైతు మంచి కోసమే నియంత్రిత వ్యవసాయ విధానం'

ఇదీ చూడండి :లాక్​డౌన్​ ఎఫెక్ట్​... వ్యాపారాలు డీలా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details