తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ పాలనలో ఎస్సీల బతుకులు ఆగమయ్యాయి: మందకృష్ణ - cm kcr

వచ్చే ఎన్నికల్లో పేదప్రజలు కేసీఆర్​కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్​ పాలనలో ఎస్సీలు, గిరిజనుల బతుకులు ఆగమయ్యాయని ఆరోపించారు.

mandakrishna comments on cm kcr
కేసీఆర్​ పాలనలో ఎస్సీల బతుకులు ఆగమయ్యాయి: మందకృష్ణ

By

Published : Sep 4, 2020, 1:47 PM IST

కేసీఆర్ పాలనలో ఎస్సీలు, గిరిజన బతుకులు ఆగం అయ్యాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఖమ్మంలోని ధర్నాచౌక్​లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా... ఎస్సీల భూములను పోలీస్​ బలంతో లాక్కుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పేద ప్రజలందరూ కేసీఆర్​కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు..!

ABOUT THE AUTHOR

...view details