ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న కలహాలతో మనస్తాపం చెందిన కృష్ణమాచారి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ గదిలో ఉరివేసుకున్నాడు. తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య - wyra
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో జరుగుతున్న గొడవలతో విసుగు చెంది అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య