తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస పాలన' - CM KCR Latest News

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్​లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూరాకుల నాగభూషణం ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.

Khammam District Crime News
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస పాలన'

By

Published : Nov 20, 2020, 7:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​... రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్​ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్​లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

'రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస పాలన'

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటలను అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. సహకార సంఘాల ద్వారా రైతులకు వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details