కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతున్న నేపథ్యంలో... కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా బయటకు రావాలని ఖమ్మం జిల్లా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. లేకుంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'స్వచ్ఛందంగా ముందుకు రాని వారిపై కేసులు నమోదు చేస్తాం' - ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్
కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఖమ్మం జిల్లా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. అలా రాని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'స్వచ్ఛందంగా ముందుకు రాని వారిపై కేసులు నమోదు చేస్తాం'
జిల్లాలో లాక్డౌన్కు ప్రజలు సహకరిస్తున్నారని... రాబోయే కాలంలో కూడా సహకరించాలని సూచించారు. రేపటి నుంచి నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. మూడు కిలోమీటర్ల పరిధి దాటి వచ్చే వారి వాహనాలు సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి:ఈ పానీయం ట్రై చేయండంటోన్న రకుల్