పంట సాగు వివరాలపై ఖమ్మం కలెక్టర్ ఆరా ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ పొలాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక సందర్శించారు. కామేపల్లి మండలంలో వరి పొలాలు, చెరువులు పరిశీలించి నీటి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఏన్కూరు మండలంలో ప్రత్యామ్నాయ సాగులో భాగంగా ఇమాంనగర్ రైతులు సాగుచేసిన పసుపు, కరివేపాకు, కాకర, చెరుకు పంటలపై ఆరా తీశారు. రైతుల ద్వారా పంటల సాగు వివరాలు, వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. కరివేపాకు సాగు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.