శుక్రవారం కురిసిన అకాల వర్షం ఖమ్మం మిరప రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్న సుమారు 30 వేల బస్తాల పంట వర్షానికి తడిసి పోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే దశలో నాశనమై రైతులకు తీరని బాధను మిగిల్చింది.
మిర్చి తడిచిందని సాకులు.. రైతుల లాభాలకు చిల్లులు... - అకాల వర్షంతో ఖమ్మం మిరప రైతులకు తీవ్ర నష్టం
ఆరుగాలం కష్టపడి మిరప పంట పండించారు. తీరా పంట చేతికొచ్చి మార్కెట్కు కూడా తీసుకొచ్చాక... అకాల వర్షం పడి అన్నదాతలను ఆగం చేసింది.
అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం
చేసేదేం లేక ఈరోజు మిర్చిని ఆరబోశారు రైతులు. ఆరిన తర్వాత కూడా వ్యాపారులు తడిసిన పంటను కొనడం లేదని రైతులు వాపోయారు. తడిసిందంటూ... పంటను తక్కువ ధరకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తక్కువ ధరకే పంటను అమ్ముకుంటుండగా... మరికొందరు రైతులు సరుకును ఇంటికి తీసుకెళ్తున్నారు.