BRS PUBLIC MEETING LUNCH MENU ITEMS ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరయ్యే ముఖ్యఅతిథులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులకు ఉదయం అల్పాహారం, ఖమ్మంలో భోజనం మెనూను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణ సంప్రదాయ వంటలను అతిథులకు రుచి చూపించనుంది. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలు సిద్ధం చేయనుంది. మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, కొరమేను కూర, తెలంగాణ మటన్ కర్రీ, తలకాయ ఇగురు, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, బోటీ ఫ్రై, మటన్ లివర్ ఫ్రైతో విందు ఇవ్వనుంది. పనీర్ బటర్ మసాలా, మెతీ చమన్, దాల్ తడ్కా, బచ్చలకూర మ్యాంగో పప్పు, బీరకాయ శనగపప్పు కూర, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పు, పచ్చిపులుసు వంటి వెజ్ కూరలు సిద్ధం చేయనుంది. ఈ మెనూతో మొత్తం 500 మంది విందు ఆరగించనున్నారు.