ఖమ్మం జిల్లాలోని ఆలయాలు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. ఏన్కూరు శివాలయంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. మహిళలు వెలిగించిన దీపాల వెలుగుల్లో ధ్వజస్తంభం కాంతులీనింది.
ఖమ్మంలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు - karthik pujalu at temples khammam
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఖమ్మంలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు