తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలంలోనూ భానుడి ప్రతాపం

వానాకాలంలోనూ భానుడు విజృంభిస్తున్నాడు. ఖమ్మంలో జులై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లకాలంలో ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది.

By

Published : Jul 11, 2019, 5:22 AM IST

Updated : Jul 11, 2019, 7:56 AM IST

వానాకాలంలోనూ భానుడి ప్రతాపం

నిండు వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మంలో బుధవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. గత పదేళ్ల కాలంలో జులై ఉష్ణోగ్రత ఈ నగరంలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2014 జులై 2న నల్గొండలో 40.4 డిగ్రీలతో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలు దాటొద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా... ఏకంగా 40కిపైగా నమోదవడం గమనార్హం. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు పడ్డాయి.

వానాకాలంలోనూ భానుడి ప్రతాపం
Last Updated : Jul 11, 2019, 7:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details