ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని మధ్య తరహా జలాశయం పెనుబల్లి మండలం లంకసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నుంచు అలుగు పోస్తుండడం వల్ల ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు... అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు - ఖమ్మం తాజా వార్తలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం నీటితో చెరువులు కుంటలు అడుగులు పోస్తున్నాయి.
ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు... అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు
కసత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు పోస్తుంది. ఈ నీటితో వేంసూరు మండలంలోని 46 చెరువులను నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయి.