రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని చెరువులు నిండటం వల్ల అలుగులు పడి.. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నగరంలోని ఖానాపురం, పాండురంగాపురం, దానవాయిగూడెం, టీఎన్జీవో కాలనీ, కవిరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో నీరు చేరింది.
ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం - heavy rains news
ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని చెరువులు నిండటం వల్ల... వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
కొన్ని ప్రాంతాల్లో నివాసాల చుట్టూ... నీరు చేరడం వల్ల స్థానికులు ఇబ్బంది పడ్డారు. నగరంలోని ఏడో డివిజన్ కొత్తగూడెం వద్ద వాగు పొర్లడంతో కల్వర్టు పైగా నీరు ప్రవహిస్తోంది. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ఇదీ చూడండి:మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు.. ఇదిగో వీడియో...