తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిప్రియ 'ఉక్కు' దీక్ష - బయ్యారం

బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ 36 గంటల దీక్షను చేపట్టారు. ఆమెకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష

By

Published : Feb 13, 2019, 8:40 PM IST

బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ చేపట్టిన దీక్షకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే ఆదివాసీలు, గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బానోత్​ హరిప్రియ మండిపడ్డారు. అన్ని సహజ వనరులు ఉన్నా కర్మాగారం ఏర్పాటు లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్​ ప్రకారం కర్మాగార ఏర్పాటుకు చర్యలు చేపట్టకపోతే దీక్షను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details