ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన గూడెం సర్పంచ్ కోమటి శ్రీలేఖ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు 50,000 వితరణ చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి ఆరువందల యాభై రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను 80 కుటుంబాలకు అందజేశారు.
పెనుబల్లిలో నిత్యావసర వస్తువుల పంపిణీ - groceries distribution at penuballi
నిరుపేదలకు అండగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.
పెనుబల్లిలో నిత్యావసర వస్తువుల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దని ఎమ్మెల్యే కోరారు. ఆపత్కాలంలో నిరుపేదలకు అండగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి:ఇంటింటి సర్వేలో వైద్య సిబ్బందికి తిప్పలు