ఖమ్మం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు యత్నిస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఖమ్మం సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఒక బాలిక చనిపోగా ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి.
వసతి గృహంలో ప్రమాదం జరిగిన గదులను మందకృష్ణ పరిశీలించి ప్రమాద ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో మాట్లాడారు. ప్రభుత్వం దళితుల వసతి గృహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థిని మృతిచెందినా స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శకు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను కేసీఆర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాలపై అధ్యయన కమిటీ వేసి నివేదికను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్, గవర్నర్‌లకు అందిస్తామని పేర్కొన్నారు.
'ఎస్సీ వసతి గృహాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం' - షార్ట్ సర్క్యూట్
ఖమ్మం సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరిశీలించారు. ఇటీవల విద్యుదాఘాతం జరిగిన ఘటనలో బాధితులను పరామర్శించారు.
స్థానిక ఎమ్మెల్యేను కేసీఆర్ సస్పెండ్ చేయాలని మందకృష్ణ డిమాండ్
ఇవీ చూడండి : వసతులు లేవని విద్యార్థుల ఆందోళన