ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో తెజస ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించింది. అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.
అమలు తీరుతెన్నులపై చర్చ...
భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులపై సమీక్ష చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవచ్లేదని తమ పార్టీ భావిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలంలో వరద నీరు కారణంగా విష జ్వరాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా తెరాస సర్కార్ ప్రజారోగ్యం పెడచెవిన పెట్టిందన్నారు. లే అవుట్ వర్గీకరణను క్రమబద్ధం చేసి 300 గజాల వరకు పన్ను రాయితీ ఇవ్వాలన్నారు.
ఇవీ చూడండి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రణాళికలు