ప్రేమ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై కలిసి సామూహిక అత్యాచారం జరిగింది. చీమకుర్తికి చెందిన రామయ్య ఖమ్మం జిల్లాకు బేల్దార్ పనులకు వెళ్లాడు. అక్కడ ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి చీమకుర్తి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. 20 రోజులుగా బాలికను వేధిస్తూ అసభ్యకరంగా వీడియోలు తీశాడు. తన స్నహితులతో సన్నిహితంగా మెలగాలని వేధించాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయపడిన బాలిక వారి నుంచి తప్పించుకుని ఒంగోలు చేరుకుంది. అక్కడ క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ విచారించగా అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమపేరుతో బాలికపై సామూహిక అత్యాచారం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలికపై ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై కలిసి సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత బాలిక భయపడి వారి నుంచి తప్పించుకుని ఒంగోలుకు చేరుకుంది. అధికారులు క్వారంటైన్‌కు తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది.
girl-gang-rape-in-ongle-dist