మహిళలు వంటింటికే పరిమితం కాదని మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలు తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు.
మహిళలు వంటింటికే పరిమితం కాదు: పొంగులేటీ
ఖమ్మం జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగను పురస్కరించుకొని కల్లూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో.. తమ ప్రతిభను కనబర్చాలని కోరారు.
'మహిళలు వంటింటికే పరిమితం కాదు'
సుమారు 200 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. విజేతలకు పొంగులేటి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:కరోనా వేళ... తెలుగు వనితలు వెలుగయ్యారు!