లాక్ డౌన్ కొనసాగుతోన్న వేళ ప్రజల కష్టాలను తీర్చటంలో మేము సైతం అంటూ ఖమ్మంలో మాజీ సైనిక ఉద్యోగులు ముందుకు వచ్చారు. తమకు తోచినంతంగా పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పేదలు, ఆకలితో ఉన్న వారికి నాలుగు వందల ఆహార పోట్లాలు పంపిణీ చేశారు.
పోలీసులకు సాయంగా విధులు నిర్వహిస్తాం: ఖమ్మం మాజీ సైనికులు - ఖమ్మంలో మాజీ సైనికుల ఆహార పంపిణీ
కశ్మీర్లో సైనికుల సేవ ఎంతో గొప్పది. దేశం కోసం పాటుపడటంలో వారే ముందుంటారు. ఇప్పుడు ఈ విపత్కర సమయంలో కూడా ముందుంటామంటున్నారు ఖమ్మంలోని మాజీ సైనిక ఉద్యోగులు. తమకు తోచినంతగా పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానం చేశారు. పోలీసులకు సాయంగా విధులు కూడా నిర్వహిస్తామన్నారు.
పోలీసులకు సాయంగా విధులు నిర్వహిస్తాం: ఖమ్మం మాజీ సైనికులు
దేశంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తాము ఇంట్లో ఉండలేమని మాజీ సైనికులు తెలిపారు. అవసరమైతే పోలీసులకు సాయంగా వాలంటరీగా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు