ఖమ్మం లకారం చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా లకారం ట్యాంక్ బండ్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలు పెంచుతున్నారు. ఐదు రోజుల క్రితం ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ 8000 చేపపిల్లలను నీటిలో వదిలారు. నిన్న మధ్యాహ్నం నుంచి చేప పిల్లలు, పెద్ద చేపలు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. చెరువులో ఉన్న వర్షపు నీళ్లకు సాగర్ జలాలు తోడుకావడం వల్ల చేపలకు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు సహకార సంఘం సభ్యులు తెలిపారు. టన్నునార చేపలు మృతి చెందినట్లు వారు చెప్పారు.
ఆక్సిజన్ అందక చేపల మృతి - fish
ఆక్సిజన్ అందక ఖమ్మం లకారం చెరువులో చేపలు మృతి చెందాయి. నిన్న మధ్యాహ్నం నుంచి చేప పిల్లలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకోస్తున్నాయి.
మృతి చెందిన చేప పిల్లలు