ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్ వద్ద లారీ, ఆటో ఢీకొని తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. ఏనుకూరు నుంచి తల్లాడ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జల్లి వెంకటేశ్వర్లు, అతని కుమారుడు రవీంద్ర మృతి చెందారు.
ఆటోను ఢీకొట్టిన లారీ.. తండ్రీకొడుకులు మృతి - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
ఓ రోడ్డు ప్రమాదం తండ్రీకొడుకులను బలితీసుకుంది. లారీ, ఆటో ఢీకొట్టిన ఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
accident
లారీ తగలడంతో ఇరువురు ఆటోలో ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు బయటకు తీయగా.. రవీంద్ర అప్పటికే మృతి చెందాడు. తండ్రి వెంకటేశ్వర్లు తీవ్రగాయాలతో ఉండగా... ఖమ్మం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వైరా వద్దకు వెళ్లగానే.. అతడు కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.