సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఖమ్మంలో భాజపా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఖమ్మంలో రైతుల ఆందోళన - ఖమ్మంలో రైతుల ఆందోళన
సన్నరకం ధాన్యాన్ని రూ.2,500 కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేశారు. పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఖమ్మంలో రైతుల ఆందోళన
ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని బలవంతంగా ఆదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరగా 1880 రూపాయలు చెల్లిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వం ఆదనంగా 600లు ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టొద్దు'