ఖమ్మం జిల్లాలోని సిరిపురం మేజర్ కాలువ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. వారబంది లేకుండా సాగర్ జలాలను విడుదల చేయాలని కోరుతూ.. జిల్లాలోని తల్లాడ మండల కేంద్రంలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాన్ని ముట్టడించి సంఘం నాయకులు, రైతులు ఆందోళన తెలిపారు.
'వారబంది లేకుండా సాగర్ నీటిని విడుదల చేయాలి' - Farmers leveling the regional agricultural center in tallada
సాగునీరు లేక చేతికొచ్చే సమయంలో తమ పంటలు ఎండిపోతున్నాయని ఖమ్మం జిల్లా రైతులు వాపోయారు. జిల్లాలోని సిరిపురం మేజర్ కాలువ నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరుతూ.. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తల్లడ మండలంలో కేంద్రంలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాన్ని ముట్టడింటారు.
'వారబంది లేకుండా సాగర్ నీటిని విడుదల చేయాలి'
సాగునీరు లేక చేతికొచ్చే సమయంలో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తాత భాస్కరరావు, గుంటుపల్లి వెంకటయ్య, నల్లమోతు మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఫోన్చేయనున్న సీఎం కేసీఆర్!