ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో ఓ రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించారు రైతులు. రాముని ప్రతిరూపంగా ఆ పక్షిని భావించే వీరు... ఆ స్వామిపై భక్తితోనే అంత్యక్రియలు చేశామని వివరించారు. ఇలా చేయడం వల్ల రామునికి సేవ చేసినట్లుగా తాము భావిస్తున్నామని అన్నారు.
రామునిపై భక్తి... రామ చిలుకకు అంత్యక్రియలు!
కోతులను ఆంజనేయ ప్రతిరూపంగా భావిస్తారు కొందరు. వానరాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఆ గ్రామస్థులు రామచిలుకను రాముని ప్రతిరూపంగా భావించారు. అందుకే ఆ పక్షికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడో తెలుసుకోవాలని ఉందా అయితే చూడండి మరి..!
రామునిపై భక్తి... రామ చిలుకకు అంత్యక్రియలు!
మేడేపల్లికి చెందిన సామినేని పూర్ణచందర్ రావు, మధుసూదన్ రావు, నంద్యాల అప్పయ్య, మోర వెంకటరామారావు, ఎడవెల్లి గ్రామానికి చెందిన పరికపల్లి ఆదినారాయణ గౌడ్ తదితరులు చిలుకకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి!