ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. పెసలు కొనుగోళ్లు నిలుపుదలను నిరసిస్తూ వైరా-మధిర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల ఆందోళన విరమింపచేశారు.
వైరా-మధిర రహదారిపై రైతుల రాస్తారోకో
ఖమ్మం జిల్లా వైరా-మధిర ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పెసలు కొనుగోళ్లు నిలుపుదల చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరా-మధిర రహదారిపై రైతుల రాస్తారోకో