ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం లచ్చిరామ్ తండాకు చెందిన హేమ్ల, తులసికి రెండెకరాల భూమి ఉంది. దానికి తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి పంటను వేశారు. ఈ ఏడాది మిర్చి పంటకు వైరస్ తెగులు సోకి నష్టపోగా... కోతుల దాడులతో పత్తి చేతికి అందలేదు. దాదాపు 5 లక్షల అప్పు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్య - రైతు దంపతులు ఆత్మహత్య
వారికున్న బాధ్యతలే వారిని మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకునేలా చేశాయి. మొత్తం ఐదు ఎకరాల్లో పత్తి, మిర్చి వేసి... లాభాలతో అప్పులు, బాధ్యతలు తీర్చుకుందామనుకున్న వారితో విధి వింత నాటకం ఆడింది. ఉన్నవాటి కంటే ఎక్కువ అప్పులై.. పంట చేతికి రాక ఆ దంపతులు ప్రాణాలు వదిలేలా చేసింది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
రుణభారంతో రైతు దంపతులు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగారు. బంధువులు వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మృతలకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిల్లు కాగా.. మగపిల్లలు మానసిక వికలాంగులని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.