ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మందికి పైగా రుత్వికులు ఈ యాగాన్ని చేస్తున్నారు. ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం యాగశాలకు వెళ్లి చండీ యాగాన్ని మొదలు పెట్టారు.
సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్న పొంగులేటి - SAHASRA CHANDI YAAGAM
ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు.
సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్న పొంగులేటి
TAGGED:
సహస్ర చండీ యాగం