రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి కార్గొ సేవలను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏమిటి?
లాక్‌డౌన్ పరిస్థితుల్లో మక్కల తరలింపునకు లారీల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. లారీల్లో ఒక బస్తా మీద మరొ బస్తాపై పెట్టడంతో అన్‌లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని... ఖమ్మం జిల్లాలో కార్గొ బస్సులను వినియోగిస్తున్నాం. ఇప్పటికి 6 జిల్లాల్లో కార్గొ సేవలు నడుస్తున్నాయి.
మొత్తం ఎన్ని బస్సులను వినియోగిస్తున్నారు? ఈ సేవలు రైతులకు ఎట్లా లబ్ది చేరుకురుతాయి?
ఇప్పటివరకు 100 బస్సులు కార్గొసేవలను అందిస్తున్నాయి. డిపార్ట్మెంట్కు 20 నుంచి 30 బస్సులను నడుస్తున్నాయి. అకాల వర్షం వలన పంట తడుస్తుందని రైతులు ఆందోళనలో ఉంటారు. అందుకే తొందరగా పంటలను తరలించడం వల్ల వారిలో ఆందోళన తగ్గుతుంది.
లాక్‌డౌన్ సడలింపులు జరుగుతున్నాయి. ఆర్టీసీ ఎప్పుడు ప్రారంభమవుతోంది.?
తొందరలోనే ప్రజారవాణా గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువ జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాకే... ఆర్టీసీని మొదలు పెట్టాలని కేంద్రం ఆదేశిలిచ్చింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 6 జిల్లాలు మాత్రమే గ్రీన్‌జోన్‌గా గుర్తించాయి. ఆ 6 జిల్లాలు కూడా అక్కడ అక్కడ ఉండటం వల్ల ఆర్టీసీని నడపడం సాధ్యంకాదు. ఎక్కువ జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక... జిల్లా నుంచి జిల్లాలోకి నడిపేందుకు అవకాశం ఉంది.
ఆర్టీసీ ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.?
కరోనా వల్ల దృష్ట్యా సమాజం మొత్తం మారాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు పెనుమార్పులు సంభవిస్తున్నాయి. 3 సీట్లు ఉన్న వాహనాన్ని రెండుకి, 2 సీట్లు ఉన్నదాన్ని ఒకటికి కుదించాల్సి ఉంటుంది. వాహనాల్లో తక్కువ పాసింజర్స్ని తీసుకెళ్లాలా లేదా సీట్ల సంఖ్యను మార్చాలా అనేది ఆలోచన చేయాల్సిన విషయం. మేము ఆలోచిస్తుందైతే.. ప్రజారవాణా మొదలువగానే భౌతిక దూరం పాటిస్తూ... ప్రతి ఒక్కరికి శానిటైజర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తేనే బస్సులను ఎక్కించే పరిస్థితి ఉంటుంది.
ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని ఊహాగానాలు ఉన్నాయి. దానిపై మీ స్పందన?
ఎంత పెంచినప్పటికీ... 50 శాతంతో ప్రయాణికులను తీసుకెళ్లడం నష్టమే. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో కుదేలు అయి ఉంది. అటు ప్రజారవాణా, ఇటు ఆరోగ్యం రెండు ప్రభుత్వానికి ముఖ్యమే. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.