సాంకేతిక సమస్యల కారణంగా ‘ఈ’ ఓటరు నమోదు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖమ్మం నగరపాలికలో ‘ఈ-ఓటు’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 8న నగరపాలక సంస్థ అధికారులు ప్రారంభించారు. అంగన్‌వాడీ, మెప్మా, ఇతర నగరపాలక సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. సామూహిక నమోదునూ ప్రోత్సహించారు. సోమవారంతో గడువు ముగిసింది.
E Vote: 'ఈ' ఓటుకు మిశ్రమ స్పందన... నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోని రిజిస్ట్రేషన్లు
సాంకేతిక సమస్యల కారణంగా ‘ఈ’ ఓటరు నమోదు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రజల్లో మిశ్రమ స్పందన లభించినప్పటికీ... మొబైల్ నంబరుకు, ఆధార్‌కు అనుసంధానం లేకపోవడం, ఓటీపీలు రావడంలో జరిగిన జాప్యం వంటి కారణాలతో నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తికాలేదని’ అధికారులు తెలిపారు.
‘మొత్తంగా ప్రజల్లో మిశ్రమ స్పందన లభించింది. మొబైల్ నంబరుకు, ఆధార్‌కు అనుసంధానం లేకపోవడం, ఓటీపీలు రావడంలో జరిగిన జాప్యం, నమోదుపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో నిర్దేశించుకున్న లక్ష్యం (10 వేల రిజిస్ట్రేషన్లు) పూర్తికాలేదని’ అధికారులు తెలిపారు. ఎంతమంది నమోదు చేసుకున్నారన్న విషయమై స్పష్టమైన వివరాలు తమకు తెలిసే అవకాశం లేదని, సుమారు 4-5 వేల మంది నమోదై ఉంటారని వెల్లడించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చివరి మూడు రోజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడం కూడా మరో ప్రధాన కారణమన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ నెల 20న మాక్ (మాదిరి) ఓటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇదీ చదవండి:EC stop Dalithabandhu: ఈసీ కీలక నిర్ణయం.. హుజూరాబాద్ పరిధిలో దళితబంధు నిలిపివేత