రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్.. ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. ఏన్కూరు మండలంలో నిర్మాణ పనులను శ్రీకాంత్ తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. నిధుల కొరత లేకుండా గ్రామ పంచాయతీల్లో ఉన్న 14 వ ఆర్థిక ప్రణాళిక నిధులను బదలాయిస్తున్నట్లు తెలిపారు.
'రైతు వేదికల నిర్మాణ పనుల్లో జాప్యం తగదు' - ఖమ్మంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించిన డీపీఓ
రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్.. ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. ఏన్కూరు మండలంలో నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు.
'రైతు వేదికల నిర్మాణాల్లో జాప్యం తగదు'
జన్నారం రైతు వేదిక నిర్మాణం చాలా నిదానంగా సాగుతోందని, వెంటనే పనులు వేగవంతం చేయాలని అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులను శ్రీకాంత్ ఆదేశించారు.
ఇదీ చదవండి:బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు