ఖమ్మం జిల్లా మధిరలో పౌరాణిక రంగస్థల నిరుపేద కళాకారులకు అజాద్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా మధిర పరిసర ప్రాంతాల్లోని 1000 మంది కళాకారులకు సరుకులు అందించారు.
పౌరాణిక రంగస్థల కళాకారులకు సరుకుల పంపిణీ - azad youth in madhira, khammam
లాక్డౌన్ అమలు కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో పౌరాణిక రంగస్థల నిరుపేద కళాకారులకు కిరాణా సామగ్రి అందించారు. అజాద్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అజాద్ యూత్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ
కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సామాజిక కార్యకర్త లంక కొండయ్య అవగాహన కల్పించారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే కరోనా నివారణలో ఆయుధాలుగా నిలుస్తాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య జిల్లా బాధ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్, రామభక్త సీతయ్య, కళా పరిషత్ బాధ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!