Crop Damage in Khammam 2023 : మిగ్ జాం తీవ్ర తుపాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో తుపాను ప్రభావంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పైర్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
ఓవైపు కోతలు పూర్తయి కల్లాలు, రహదారుల పక్కన ఆరబోసిన ధాన్యం రాసులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. మరోవైపు టార్పాలిన్లు, పట్టాలు కప్పుకుని ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పంటలు వర్షాలతో దెబ్బతిన్నాయి. ప్రధానంగా పత్తి, మిర్చి పైర్లన్నీ వర్షపు నీటిలో తడిసిముద్దయ్యాయి.
Husband and Wife Died in Khammam Due to Rain: రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఓ ఇంటి పైకప్పు కూలి భార్యాభర్తలు ఇద్దరుమృతి చెందారు. అశ్వాపురం మండలం భీమవరంలో వర్షం, చలి కారణంగా ఉప్పలయ్య అనే వ్యక్తికి చెందిన 40 గొర్రెలు మృత్యువాత(40 Goats Died Due to Sudden Rains) పడ్డాయి.
మిగ్జాం ఎంత పనిచేసింది - కోతకొచ్చిన పంటను నేలరాల్చింది - ధాన్యం కుప్పలను నీట ముంచింది
వైరా నియోజకవర్గంలో తుఫాను తాకిడికి చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో వరి కోతలకు సిద్ధమవుతున్న కర్షకులు నీట మునిగిన పొలాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వైరా ఏనుకూరు కొణిజర్ల తల్లాడ మండలాల్లో లోతట్టు పొలాల్లో వరద నీరు చేరడంతో పంట చేలు నీట మునిగాయి. ఈదురు గాలులకు వరి, మిరప పొలాలు విరిగిపడ్డాయి.
Heavy Rain in Khammam District : పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దయ్యాయి. ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడవడంతో కర్షకులు ఆవేదన చెందుతున్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామాల వద్ద పొంగి పొర్లుతున్న వాగుల వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మిగ్ జాం తుఫాను ప్రభావం - నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మిగ్ జాం తుపాను ప్రభావానికి మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో అపార నష్టాం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవిన్యూ డివిజన్ వ్యాప్తంగా కురిసిన వర్షానికి చేతికొచ్చిన పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాతపూత దశలో ఉన్న మిర్చి పంట వర్షాల కారణంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు మనోవేదన చెందుతున్నారు.
Coal production Stopped in Bhadradri Kothagudem : మరోవైపు తుపాను ధాటికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి(Coal Production Stopped)కి విఘాతం కలిగింది. కోయగూడెం ఉపరితల గనిలో పాక్షికంగా ఉత్పత్తి జరగగా 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. మరోవైపు ఉపరితల గని పరిధిలో 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. విస్తారంగా కురిసిన భారీ వర్షానికి భూపాలపల్లిలోకి రెండు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సుమారు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
తీరం దాటిన మిగ్జాం తుపాను - తీర ప్రాంతంలో ఈదురు గాలులు
తెలంగాణపై మిగ్జాం తుపాన్ ఎఫెక్ట్ - అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు