ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిండు గర్భిణీ నొప్పులతో అందులోనూ రక్తస్రావం అవుతుంటే కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా చోద్యం చూశారని ఆరోపించారు. బాధితురాలికి మద్దతుగా మాట్లాడిన సీఐటీయుూ నాయకున్ని మర్యాద లేకుండా దుర్భాషలాడిందని తెలిపారు. వైద్యురాలిని వెంటనే విధుల నుంచి తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
'నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిని తొలగించాలి' - CPM ACTIVISTS ARE PROTESTED IN FRONT OF MATHA SHISHU CENTER
ఖమ్మం మాతా శిశు ఆరోగ్యం కేంద్రం ముందు సీపీఎం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చావు బతుకుల నడుమ ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించిన వైద్యురాలిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
CPM ACTIVISTS ARE PROTESTED IN FRONT OF MATHA SHISHU CENTER
TAGGED:
cpm darna