ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు 8పాజిటివ్ కేసులు వచ్చినప్పటికీ... అందరూ కోలుకున్నారు. బతుకుదెరువు కోసం పుణె వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి తొలుత ప్రారంభమైన పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. మధిర, పెనుబల్లి మండలాల్లో వెలుగుచూశాయి.
ఖమ్మంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు - ఖమ్మంలో కరోనా వార్తలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇంతకు ముందు 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా... అందురూ కోలుకొని ఇంటికెళ్లారు. ప్రస్తుతం మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.
ఖమ్మంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
తాజాగా మధిర మండలంలో ఒకరికి, నేలకొండపల్లి మండలంలో మరోవ్యక్తికి కరోనా సోకినట్టు తెలింది. వీటితో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 6కు చేరాయి. కరోనా సోకిన 65 ఏళ్ల ఓ వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది.