మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సుల రంగుపై మంత్రితో ముఖ్యమంత్రి మాట్లాడారు. బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలని మంత్రిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.
మంత్రి పువ్వాడకు సీఎం ఫోన్.. ఆ బస్సుల రంగును తొలగించాలని ఆదేశం
ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమెన్ బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలని మంత్రిని సీఎం ఆదేశించారు.
మంత్రి పువ్వాడకు సీఎం ఫోన్.. ఆ బస్సుల రంగును తొలగించాలని ఆదేశం
ఖమ్మంలోని ఎస్సార్-బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బస్సులను మంత్రి అజయ్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి:అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి