తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు - cm kcr birthday latest news

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. కేక్​ కోసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

CM kcr Birthday celebrations in the joint Khammam District
ఖమ్మం జిల్లాలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

By

Published : Feb 17, 2021, 3:04 PM IST

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. వేడుకలను పార్టీ నేతలు, గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోశ్​కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అటు సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర, కూసుమంచిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ ఛైర్మన్​ కమల్​రాజు ముదిగొండలో మొక్కలు నాటగా.. డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగ భూషయ్య ఖమ్మం 8వ డివిజన్​లో మొక్కలు నాటారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని.. బంగారు తెలంగాణ చేసే లక్ష్యంతో ముందుకెళ్తోన్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:కేసీఆర్ మా తండ్రి కావడం అదృష్టం: కేటీఆర్, కవిత

ABOUT THE AUTHOR

...view details